ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలు
Sakshi Education
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో థియరీకి ఇస్తున్న ప్రాధాన్యత ప్రాక్టికల్స్‌కు ఇవ్వడంలేదు. దీనివల్ల అధికశాతం విద్యార్థులు వృత్తిలో అంతగా రాణించలేకపోతున్నారు. దీంతో ఇంజినీరింగ్ విద్యలో సంస్కరణలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. థియరీతోపాటు ప్రాక్టికల్స్‌పైన కూడా దృష్టి సారించేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం అమెరికాలోని కళాశాలల్లో బోధన పద్ధతులపై అధ్యయనం చేసింది. ఇటీవల ఉన్నత విద్యాశాఖకు చెందిన అధికారుల బృందం అమెరికాలోని ఆరు ప్రభుత్వ, ప్రయివేటు యూనివర్సిటీలను సందర్శించింది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన బోధన అందించడం, అత్యుత్తమ విద్యాసంస్థలను నెలకొల్పడం ఈ సందర్శన వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. అక్కడి విశ్వవిద్యాలయాల్లోసాంకేతిక విద్యా బోధనలో అమలవుతున్న అధునాతన ధోరణులను అధ్యయనం చేసింది. ఈ బృందం ప్రభుత్వానికి పలు సిఫారసులు చేయనుంది. ఈ బృందం పరిశీలనలో తేలిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
80 శాతం పరిశోధన.. 20 శాతం బోధన..
అమెరికా వర్సిటీల్లో బోధన తరగతి గదికి మాత్రమే పరిమితం కాదు. అక్కడి ప్రొఫెసర్లు బోధన చేసేది 20 శాతం మాత్రమే. మిగిలినసమయమంతా వారు పరిశోధనల్లో నిమగ్నమవుతుంటారు. విద్యార్థులను అందులో మమేకం చేస్తారు. ఈకారణంగా ప్రతి అంశం విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా తెలుసుకునే అవ కాశం ఏర్పడుతుంది. విద్యార్థి కోర్సులో చేరిన తొలి రోజు నుంచే ఇది మొదలవుతుంది. విద్యార్థుల వైఫల్యాలను పరిగణనలోకి తీసుకోరు. వారు ప్రయత్నం చేస్తున్నారా? లేదా? అన్నదే బోధకులు గమనిస్తారు. కాపీ కొట్టడం వంటివి అక్కడ క్షమార్హం కానేకాదు. విద్యార్థులు కూడా అలాంటివాటి జోలికి వెళ్లరు.
పారిశ్రామిక అనుసంధానం విస్తృతం
అక్కడి యూనివర్సిటీల్లో సాంకేతిక విద్య అందించే సంస్థలు పరిశ్రమలతో తప్పనిసరిగా అనుసంధానమై ఉంటాయి. దీని వల్ల పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో విద్యార్థులకు తెలుస్తుంది. ఆ నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం చిక్కుతుంది. పరిశ్రమలకు కూడా ఆ విద్యార్థులపై ఒక అవగాహన ఉంటుంది. కోర్సు ముగిసిన వెనువెంటనే సంబంధిత పరిశ్రమల్లో విద్యార్థులకు ఉద్యోగం లభించే అవకాశాలుంటాయి.
తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్..
అక్కడి సాంకేతిక విద్యాసంస్థలు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. దీనికారణంగా విద్యార్థి కోర్సులో ఉండగానే ఉద్యోగిగా శిక్షణ పొందుతాడు. నేర్చుకున్న నైపుణ్యాలను వాస్తవరూపంలోకి తెచ్చి ఉద్యోగిగా తన పనితనాన్ని నిరూపించుకునే విశ్వాసం కలుగుతుంది. ఇంటర్న్‌షిప్ మాత్రమే కాకుండా అసైన్‌మెంట్లు, లైవ్‌ప్రాజెక్టులు విద్యార్థులను సుశిక్షితులను చేస్తాయి.
వర్సిటీలచే కంపెనీలకు దిశానిర్దేశం ..
ఇక్కడి కంపెనీలు తమ ప్రాజెక్టు రిపోర్టులకు, ఇతరత్రా నివేదికలకు కన్సల్టెన్సీలపై ఆధారపడుతాయి. కానీ యూఎస్‌లో అనేక కంపెనీలకు వర్సిటీలే దిశానిర్దేశం చేస్తాయి. అక్కడి వర్సిటీలంటే కంపెనీలకు అంత నమ్మకం. కంపెనీలు తమకు అవసరమయ్యే పరిశోధనల కోసం కూడా యూనివర్సిటీలపై ఆధారపడుతాయి.

Published date : 29 Nov 2013 11:23AM