ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ-కళాశాల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ‘ఈ-కళాశాల’ ప్రోగ్రాంను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు అనుమతిస్తూ బీసీ సంక్షేమ శాఖ నవంబర్ 29నఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా వెనుకబడిన తరగతులు, ఈబీసీ, కాపు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మొత్తం 1,050 మందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈబీసీ కార్పొరేషన్ నిధుల నుంచి రూ.51,625, కాపు కార్పొరేషన్ నుంచి రూ.95,875, బీసీ కార్పొరేషన్ నుంచి రూ.1,62,250 ఖర్చు చేయనున్నారు. కాగా, ఈ-కళాశాలలో పీజీ, ఇతర కోర్సులు చదువుకోవాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Published date : 30 Nov 2019 02:13PM