ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఐఐటీ మెటీరియల్!
Sakshi Education
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ విద్యార్థులు ఇకపై నాణ్యమైన దూరవిద్య ద్వారా వివిధ కోర్సులు అభ్యసించడంతోపాటు ఐఐటీలు రూపొందించిన మెటీరియల్‌ను కూడా పొందొచ్చు. వీడియో, టెక్ట్స్ మెటీరియల్, ప్రాబ్లమ్ సెట్స్, ప్రొఫెసర్లు, తోటి విద్యార్థులతో ఇంటరాక్షన్ తదితర అవకాశాలతో దూరవిద్య ద్వారా నిర్వహించే ‘మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (మూక్)’ను మానవ వనరుల మంత్రి పళ్లంరాజు శుక్రవారమిక్కడ ప్రారంభించారు. దీని వల్ల 40 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. 10 వారా ల పాటు ఉండే తొలి కోర్సును ఐఐటీ మద్రాస్ మార్చి 3 నుంచి అందిస్తుంది. ఇందులో చేరాలనుకునే విద్యార్థులు onlinecourses.nptel.ac.inలోకి లాగిన్ అయి పేర్లు నమోదు చేసుకోవచ్చు.
Published date : 01 Mar 2014 11:49AM