ఇంజనీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వివిధ ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సుల ఫీజులను రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి ఖరారు చేసింది.
జూన్ 17న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వీటిని ఖరారుచేశారు. ఇంజనీరింగ్ కోర్సుల కనిష్ఠ ఫీజును రూ.40 వేలుగా, గరిష్ఠ ఫీజును రూ.1.17 లక్షలుగా మండలి ఖరారు చేసినట్లు సమాచారం. వీటిని జూన్ 18న ప్రభుత్వానికి అందించనుంది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు ఈ ఫీజులు అమలు కానున్నాయి. ఇప్పటివరకు కనిష్ఠ ఫీజు రూ.35 వేలుగా, గరిష్ఠ ఫీజు రూ.1.08 లక్షలుగా అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఫీజులను 15 నుంచి 20 శాతం మేర పెంచుతూ మండలి నిర్ణయం తీసుకుంది. కనిష్ఠ స్థాయిలో రూ. 47,500 వరకు ఫీజు ఉన్న కాలేజీలు 60 వరకు ఉండనున్నాయి. రూ.1 లక్షకు పైగా ఫీజులు ఉన్న కాలేజీలు 20 వరకు ఉండనున్నాయి.
Published date : 18 Jun 2019 03:01PM