‘ఇంజనీరింగ్’ ఫీజు పెంపు దిశగా కసరత్తు...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు పెంపు దిశగా కసరత్తు మొదలైంది. యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. కొత్త ఫీజులు ఖరారు చేసే వరకు కొంతమేర ఫీజు పెంచేందుకు అధికార వర్గాలు సిద్ధమయ్యాయి.
ఇందులో భాగంగా జూన్ 29న యాజమాన్యాలతో సమావేశం నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి, ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ చర్యలు చేపట్టాయి. కొత్త ఫీజులను ఖరారు చేసేవరకు ఇప్పటివరకు వసూలు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాలన్న నిర్ణయానికి వచ్చాయి. అయితే యాజమాన్యాలు అందుకు అంగీకరిస్తాయా లేదా అన్నది తేలాల్సి ఉంది.
10 నుంచి 15 శాతం వరకు..
పాత ఫీజుల అమలుకు యాజమాన్యాలు ఒప్పుకోకపోతే ఎలా ముందుకు సాగాలన్న ఆలోచనలు ప్రభుత్వం ఇప్పటికే చేసింది. కాలేజీలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేస్తే మాత్రం తల్లిదండ్రులు తీవ్ర వ్యవతిరేకత వస్తుందన్న నిర్ణయానికి అధికారవర్గాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా కొంత మేర ఫీజు పెంపునకు అంగీకరించాలన్న అలోచనల్లో అధికారులు ఉన్నట్లు తెలిసింది. జూన్ 29న ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో యాజమాన్యాల నిర్ణయం మేరకు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ఆధారపడి ఉంది. జూన్ 27 నుంచే వెబ్ ఆప్షన్లను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కోర్టు తీర్పు కాపీ అందలేదని ప్రవేశాల కమిటీ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసింది. జూలై 1 నుంచి 4 వరకు వెబ్‌ఆప్షన్లు స్వీకరించేలా షెడ్యూల్‌ను సవరించింది. యజ మాన్యాలు అధికార వర్గాల ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూల్‌ను మరికొన్నాళ్లు వాయిదా వేసి, ఫీజులు ఖరారు చేయాలన్న ఆలోచనల్లో ఉన్న ట్లు సమాచారం. 10 నుంచి 15 రోజుల్లో ఫీజులను ఖరారు చేశాకే ముందుకు సాగే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక కోర్టు తీర్పు కాపీ జూన్ 26 రాత్రి అందింది. అది అందాక ఆగమేఘాలపై కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే జూన్ 28 నాటికి కూడా అప్పీల్ చేయలేకపోయింది.
కోర్టును ఆశ్రయించిన కాలేజీలకూ..
మొదట కోర్టును ఆశ్రయించిన 6 కాలేజీల్లోనే యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని కోర్టు తీర్పునివ్వగా, అదే తీర్పును తమకు వర్తింపజేయాలని మరో 75 కాలేజీలు కోర్టుకు వెళ్లాయి. వాటికి కూడా కోర్టు అదే తీర్పును అమలు చేయాలని జూన్ 28న ఉత్తర్వులిచ్చినట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొన్నారు. ప్రభుత్వం జూన్ 27న ఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ను నియమించింది. ప్రక్రియ చేపట్టినా ఫీజుల ఖరారుకు 10 రోజుల సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే యాజమాన్యాలతో చర్చించేందుకు జూన్ 29న సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఫీజులను ఖరారు చేశాక హెచ్చు తగ్గులను సర్దుబాటు చేసుకునే వెసులుబాటున్నా అది కారణంగా అయ్యే పరిస్థితి వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

Published date : 29 Jun 2019 04:29PM