Skip to main content

ఇంజనీరింగ్, ఫార్మాలో సీట్ల కేటాయింపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్-2017 మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 23న 69,116 మందికి ఆన్‌లైన్లో సీట్లు కేటాయించారు.
ఈ మేరకు ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ జిఎస్.పండాదాస్ ఆన్‌లైన్ కేటాయింపులు చేస్తూ అభ్యర్థులకు సమాచారాన్ని పంపారు. ఎంసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న తొలివిడత సీట్ల కేటాయింపు జరగాల్సి ఉండగా రెండురోజుల ముందే ఆ ప్రక్రియను ఎంసెట్ అడ్మిషన్ అధికారులు పూర్తిచేయడం విశేషం. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో వందశాతం సీట్లు తొలివిడతలోనే భర్తీకాగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 72 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటాలో ఏకమొత్తంలో చూస్తే 71 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. గతంలో కన్నా ఇది అత్యధికం. ఈసారి ఇంజనీరింగ్ సీట్ల భర్తీ గతంలో కన్నా ఆశా జనకంగానే ఉన్నా ఫార్మా సీట్ల భర్తీ తక్కువగా ఉంది. ఫార్మసీలో వర్సి టీ కాలేజీల్లో 39 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 7శాతం భర్తీ అయ్యాయి.

ఇంజనీరింగ్, ఫార్మా సీట్ల భర్తీ ఇలా..
రాష్ట్రంలో మే 31న ఎంసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయగా జూన్ 8 నుంచి 17వ తేదీవరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగింది. జూన్ 11 నుంచి 20వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేశారు. 21, 22 తేదీల్లో ఆప్షన్లలో మార్పులకు అవకాశమిచ్చారు. ఈనెల 23 సాయంత్రానికే సీట్ల కేటాయింపు పూర్తిచేశారు. ఎంసెట్-2017లో 1,45,254 మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వగా 74,999 మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చారు. 805 మంది ఆప్షన్లు నమోదు చేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 433 ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీలున్నాయి. వీటిలో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్, ఫార్మా సీట్లు 97,402 ఉన్నాయి. వీటిలో 69,116 భర్తీకాగా 28,286 సీట్లు మిగిలాయి. కోర్సులవారీగా చూస్తే ఇంజనీరింగ్‌లో 93,921 సీట్లకు 68,810 సీట్లు భర్తీకాగా 25,111 మిగిలాయి. ఫార్మసీలో 3,481 సీట్లకుగాను 3,175 మిగిలిపోయాయి.

ఈసీఈ, కంప్యూటర్ సైన్‌‌స పోటాపోటీ :
ఈసారి ఈసీఈ, కంప్యూటర్ సైన్‌‌స కోర్సులకు అభ్యర్థులు పోటీపడ్డారు. ఈసీఈలో 23,889 సీట్లుండగా 18,993 భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్‌‌సలో 21,705 సీట్లుండగా 18,084 భర్తీ అయ్యాయి. తర్వాత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 13,167 సీట్లకు 8,274, మెకానికల్‌లో 17,022 సీట్లకు 10,924 సీట్లు, సివిల్‌లో 12,851కి 7,946 భర్తీ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2,644 సీట్లలో 2,495 సీట్లు నిండాయి. ఈసారి ఎంసెట్‌లో ట్యాప్ ర్యాంకర్లు ధ్రువ పత్రాల పరిశీలనకు రాకపోవడంతో వారి తరువాతి ర్యాంకుల వారికి అవకాశం దక్కింది. ఈసారి ఒక్క విద్యార్థీ చేరని కాలేజీ ఒకటి ఉండగా వంద శాతం సీట్లు నిండినవి 77 ఉన్నాయి.

కాలేజీల వారీగా సీట్ల భర్తీ ఇలా...

సీట్లు

కాలేజీలు

0

1

1-10

17

11-25

18

26-50

27

51-75

19

76-100

25

101-150

34

151-200

34

201-250

29

251-300

20

301-350

19

351-400

15

401-450

10

451-500

9

501-550

5

551-600

6

601-700

8

701-800

11

801-900

0

901 ఆపై

2

100 శాతం

77


వర్సిటీ, ప్రైవేటు కాలేజీల్లో ఆయా కోర్సుల సీట్ల భర్తీ ఇలా..

విభాగం

కోర్సు

కాలేజీలు

కన్వీనర్‌కోటా

భర్తీ

మిగులు

వర్సిటీ

ఇంజనీరింగ్

18

4,332

4,332

0

-

ఫార్మసీ

7

188

73

115

ప్రైవేటు

ఇంజనీరింగ్

295

89,589

64,478

25, 111

-

ఫార్మసీ

113

3293

233

3,060

మొత్తం

-

433

97,402

69,116

28,286

Published date : 24 Jun 2017 03:01PM

Photo Stories