ఇంజనీరింగ్ పరీక్షలపై నెలాఖరులో నిర్ణయం: సబితా ఇంద్రారెడ్డి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు కచ్చితంగా పరీక్షలుంటాయని, ఈ నెలాఖరులోగా దానిపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
అంతేకాకుండా సెకండ్, థర్డ్, ఫైనల్ ఇయర్లకు ప్రమోట్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా కచ్చితంగా పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా బ్యాక్‌లాగ్ సబ్జెక్ట్‌లతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ తదుపరి క్లాస్‌లకు ప్రమోట్ చేసినట్టు, ఈ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలన్నింటినీ 2020-21 విద్యాసంవత్సరంలో నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు. బుధవారం శాసనమండలిలో ఎమ్మెస్ ప్రభాకరరావు వేసిన ప్రశ్న, దానికి అనుబంధంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆకుల లలిత వేసిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
Published date : 10 Sep 2020 01:26PM