ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో 23,893 మంది వెబ్ ఆప్షన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 17 వరకు ఒకటి నుంచి 56వేల ర్యాంకు పరిధిలో 37,306 మంది విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది.
ర్యాంకు 1 నుంచి 36 వేల పరిధిలో 24,259 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాగా 23,893 మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మొత్తం విద్యార్థులు కలిపి 8,82,356 వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోగా, ఇందులో అత్యధికంగా ఓ విద్యార్థి 662 ఆప్షన్లు ఇవ్వటం విశేషం. 18న ఉదయం నుంచి 20వ తేదీ ఉదయం వరకు 36 వేల ర్యాంకు నుంచి 56 వేల ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, వారికి లాగిన్ ఐడీలు పంపామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Published date : 19 Jun 2017 02:36PM