ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు!
Sakshi Education
జూలై 10 నుంచి ప్రారంభం
ప్రభుత్వ ఉత్తర్వుల జారీ మేరకు అవసరమైతే తేదీల్లో మార్పులు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ వారికి రెండో దశలో ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్:ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూలై 10 నుంచి 20వ తేదీ వరకు మొదటి దశ సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి షెడ్యూలు ఖరారు చేసింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే షెడ్యూలును అధికారికంగా ప్రకటించనుంది. దీంతోపాటు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లోనూ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూలును సిద్ధం చేసింది. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్, మేనేజ్‌మెంట్ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటా భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వెలువ డాల్సి ఉంది. వాటిపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. మరో రెండుమూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జూలై 5 లేదా 6వ తేదీల్లో రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వడంతోపాటు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఆలస్యమైతే కౌన్సెలింగ్ తేదీల్లో మార్పు ఉంటుంది. మరోవైపు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి రెండో దశలో వేరుగా ర్యాంకులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రారంభం కానందున.. రెగ్యులర్ గా ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు తమకూ ర్యాంకులు ఇవ్వాలని అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనవారు కోరుతున్నారు. అలాచేస్తే రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉండదని, సమస్యలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
వన్‌టైమ్ పాస్‌వర్డ్‌తో ఆప్షన్లు..
వన్‌టైమ్ పాస్‌వర్డ్‌తో ఈసారి వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆప్షన్లు ఇచ్చేందుకు విద్యార్థి వెబ్ పేజీలో లాగిన్ కాగానే పాస్‌వర్డ్ విద్యార్థి మొబైల్ నంబరుకు వస్తుంది. దాన్ని ఎంటర్‌చేసి ఆప్షన్ల పేజీలోకి వెళ్లాలి. ఆ పాస్‌వర్డ్ 15 నిమిషాలు ఉంటుంది. ఆ సమయం లో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవాలి. నిర్ణీత సమయం పూర్తికాగానే విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు సేవ్ అవుతాయి. లాగ్‌అవుట్ అవుతాడు. మళ్లీ లాగిన్ అయితే మరో పాస్‌వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి ఆప్షన్ల పేజీ లోకి వెళ్లి మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఇందులో ఇంటర్నెట్ సెంటర్ల యజమానులు, దళారులు మోసం చేసినా, ప్రలోభాలకు గురిచేసినా ఆ తరువాత విద్యార్థి మళ్లీ లాగిన్ అయి మరో పాస్‌వర్డ్‌తో మళ్లీ మార్పులు చేసుకోవచ్చు.

Published date : 29 Jun 2014 12:12PM