ఇంజనీరింగ్ కామన్ పరీక్ష నిర్ణయం వాయిదా!
Sakshi Education
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఒక్కటే అర్హత పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి కేంద్ర మానవ వనరుల శాఖ పక్కకుపెట్టింది.
ఏకరీతి పరీక్ష విధానం తెస్తే తలెత్తే సమస్యలను ముందుగానే రాష్ట్రాలతో కలసి పరిష్కారించుకోవాలని ఆ శాఖ యోచిస్తోంది. ఒకే పరీక్ష నిర్వహించాలని గత నెలలో అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిర్ణయించగా పశ్చిమబెంగాల్, తమిళనాడులు అభ్యంతరం తెలిపాయి. రాష్ట్రాలతో ఈ విషయంలో ఒప్పందం కుదరకపోతే ఏ ఉద్దేశంతో పరీక్ష నిర్వహిస్తున్నామో అది నెరవేరదని అందుకే పరీక్షపై నిర్ణయాన్ని వాయిదావేశారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి కౌన్సిలింగ్‌కు సంబంధించిన నిబంధనలపైనా చర్చించాల్సి ఉంది. దీంతో 2018 విద్యాసంవత్సరంలో ఒకే పరీక్ష విధానం అమల్లోకి రావపోవచ్చు.
Published date : 29 Apr 2017 03:05PM