Skip to main content

ఇంజనీరింగ్ కాలేజీల సంఘానికి కొత్త కార్యవర్గం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్య సంఘం అధ్యక్షుడిగా ఆర్జీఎం చైర్మన్ శాంతిరాముడు ఎన్నికయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత సంఘం తొలిసారిగా తిరుపతి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. సంఘం ప్రధాన కార్యదర్శిగా మిట్స్ కరస్పాండెంట్ ఎన్.విజయభాస్కర్ చౌదరి, కోశాధికారిగా ఎంవీ.కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పి.కృష్ణప్రసాద్, లక్ష్మణ్‌రావు, సి.గంగిరెడ్డి, కార్యదర్శులుగా బీవీజీ కృష్ణ, రాజ్ లింగ్, ఏవీ ప్రతాప్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా రాజు, సుబ్బారావు, ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శాంతిరాముడు మాట్లాడుతూ.. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల అభివృద్ధికి కష్టపడి పని చేస్తానన్నారు.
Published date : 03 Aug 2015 12:52PM

Photo Stories