Skip to main content

ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 84.38 శాతం మంది హాజరు

సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్-2020కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.
ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,85,946 మంది దరఖాస్తు చేసుకోగా 1,56,899 మంది(84.38 శాతం) మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి(ఏపీ సెట్స్) డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని 47 పట్టణాల్లోని 118 పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 14 సెషన్లలో కంప్యూటరాధారితంగా ఈ పరీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో ఈసారి పరీక్ష కేంద్రాల పెంపుతో పాటు సెషన్ల సంఖ్యనూ పెంచారు. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ముగియడంతో.. అగ్రి, ఫార్మా, మెడికల్ విభాగం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విభాగంలో 87,637 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 25తో ఈ పరీక్షలు పూర్తవుతాయి. అగ్రి, మెడికల్ విభాగం తొలిరోజు పరీక్షకు 86.89 శాతం మంది హాజరయ్యారు. కాగా, ఎంసెట్-2020 ప్రాథమిక కీ’ని ఈనెల 26న విడుదల చేయనున్నారు. కీ’పై అభ్యంతరాలను ఈనెల 28 వరకు స్వీకరిస్తారు.

ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు రాసిన అభ్యర్థుల వివరాలు..

జిల్లా

దరఖాస్తు

హాజరు

అనంతపురం

9,381

8,328

కర్నూలు

10,639

9,218

వైఎస్సార్

10,032

9,135

చిత్తూరు

14,674

12,892

నెల్లూరు

10,433

9,283

ప్రకాశం

12,068

10,893

గుంటూరు

20,696

18,483

కృష్ణా

22,157

18,454

పశ్చిమ గోదావరి

12,719

11,467

తూర్పు గోదావరి

16,852

14,856

విశాఖపట్నం

17,649

15,253

శ్రీకాకుళం

7,253

6,442

విజయనగరం

5,662

5,032

హైదరాబాద్

15,731

7,163

Published date : 24 Sep 2020 04:18PM

Photo Stories