ఇంజనీరింగ్ ఆప్షన్ల గడువు 28 వరకు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ చివరి దశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల గడువును ఈ నెల 28 వర కు పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు.
షెడ్యూలు ప్రకారం సోమవారం తో వెబ్ ఆప్షన్ల గడువు పూర్తికాగా, 27న సీట్లను కేటాయించాల్సి ఉంది. అయితే ఎక్కువ మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు గడువును 28 రాత్రి 10 గంటల వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు సీట్లను 29 రాత్రి 10 గంటల తర్వాత కేటాయిస్తామన్నారు. సీట్లు పొందిన వారు 31 లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. తరగతులు ఆగస్టు 1న ప్రారంభమవుతాయన్నారు. సోమవారం 96 మంది విద్యార్థులు కొత్తగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారన్నారు. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 69,273 మంది వెరిఫికేషన్ చేయించుకున్నారన్నారు.
Published date : 26 Jul 2016 02:25PM