Skip to main content

ఇంజనీరింగ్ అధ్యాపకులకు ప్రొబేషన్ తప్పనిసరి

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో అధ్యాపకుడిగా ఎంపికై న వారికి ఏడాది పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉండాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఈ మేరకు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది.
దీంతో వచ్చే ఏడాది నుంచి దీనిని అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రొబేషన్ పీరియడ్‌లో ఆ ఫ్యాకల్టీకి ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహించాలని ఏఐసీటీఈ పేర్కొంది. ఎక్కువ మంది ఉంటే మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల ద్వారా శిక్షణ ఇవ్వాలని తెలిపింది. సెలవు దినాలు, వేసవి సెలవుల్లో కాంట్రాక్టు తరగతులు నిర్వహించాలని, ఇండక్షన్ ట్రైనింగ్‌ను రెండు విడతలుగా నిర్వహించాలని స్పష్టం చేసింది. మొదటి విడతలో ట్రైనింగ్ 450 నుంచి 480 గంటల పాటు నిర్వహించాలని, సెకండ్ విడతలో ఉద్యోగపరమైన శిక్షణ ఇండస్ట్రియల్, ఫీల్డ్ ప్రాక్టీసెస్‌కు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.

రెండు దఫాలుగా శిక్షణ...
అధ్యాపకునిగా ఎంపికై న వారికి రెండు దఫాలుగా శిక్షణ ఇవ్వాలి. మొదటి దఫాలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆలోచనా విధానం పెంపొందించే అంశాలు శిక్షణలో ఉండాలి. పరిశోధనా పత్రాల పరిశీలన, టెక్నికల్ రిపోర్ట్స్, ప్రాజెక్టు ప్రపోజల్స్ రూపకల్పన, నాన్ టెక్నికల్ కమ్యూనికేషన్, మినిట్స్ రాయడం, అఫీషియల్ కమ్యూనికేషన్స్, ఆధునిక టెక్నాలజీ వినియోగం, నిరంతరం సొంతంగా నేర్చుకునే విధానం, తమను తాము అప్‌డేట్ చేసుకోవడం, సెమినార్స్, వర్క్‌షాప్‌లలో ఇంటరాక్షన్, విద్యార్థుల మదింపు, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇన్నోవేషన్ అండ్ మీనింగ్‌ఫుల్ ఆర్ అండ్ డీ, ఇన్‌స్టిట్యూషనల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ వంటివి నేర్పించాలి. ఇక రెండో దఫాలో సీనియర్ ఫ్యాకల్టీ నేతృత్వంలో పనిచేయాలి. వారి నేతృత్వంలోనే ఇండక్షన్‌లో ఉన్న ఫ్యాకల్టీ ఒక సబ్జెక్టును బోధించాలి. ఒక ల్యాబ్ కోర్సు చేయాలి. కరిక్యులమ్ అమలు, మూల్యాంకనంలో వారు సరిగా చేస్తున్నారా? లేదా? అని సీనియర్ ఫ్యాకల్టీ గుర్తించి సరైన మార్గదర్శనం చేయాలి.

ఇన్‌సర్వీస్ శిక్షణ తప్పనిసరి...
ఫ్యాకల్టీ నిరంతరం తమను తాము అప్‌డేట్ చేసుకునేలా ఇన్‌సర్వీస్ శిక్షణ నిర్వహించాలి. వారికి రిఫ్రెషన్ కోర్సులతో పాటు దశల వారీగా ఆన్‌లైన్‌లో శిక్షణ నిర్వహించాలి.
  • 5 నుంచి 10 ఏళ్ల బోధనానుభవం ఉన్న వారికి నాలెడ్‌‌జ అప్‌డేషన్, కొత్త ఆవిష్కరణలు, స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ ప్లానింగ్, ల్యాబ్ డెవలప్‌మెంట్స్, మాన్యువల్స్ ప్రిపరేషన్, ఆన్‌లైన్ కోర్సుల ద్వారా ఎడ్యుకేషన్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం వంటివి నేర్పించాలి.
  • 10 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్న వారికి నాలెడ్‌‌జ అప్‌డేషన్, కొత్త ఆవిష్కరణలు, కరిక్యులమ్ డెవలప్‌మెంట్, రిసోర్సు మెటీరియల్ డెవలప్‌మెంట్, బోధనలో బెస్ట్ ప్రాక్టీసెస్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించాలి.
  • ఇక 20 నుంచి 30 ఏళ్ల అనుభవం ఉన్న వారికి పై వాటితోపాటు ఇన్‌స్టిట్యూషనల్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, లీడర్‌షిప్, విజన్, మిషన్ అండ్ స్ట్రాటజీ, ఇండస్ట్రీల భాగస్వామ్యంతో పరిశోధనలు, డిపార్ట్‌మెంటల్ గ్రోత్, ఎథికల్ ఎన్విరాన్‌మెంట్ వంటి అంశాలను నేర్పించాలి.
Published date : 26 Nov 2018 01:37PM

Photo Stories