ఇంజినీరింగ్ బోధనకు ఐఐటీ పట్టభద్రులు
Sakshi Education
న్యూఢిల్లీ: వెనుకబడిన ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు బోధించేందుకు ఎన్‌ఐటీ, ఐఐటీలకు చెందిన 1225 మంది పట్టభద్రులను ఎంపికచేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
వీరంతా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 53 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో మూడేళ్లపాటు బోధన చేస్తారని వెల్లడించారు. తమ మంత్రిత్వ శాఖ
ఇచ్చిన పిలుపుమేరకు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని 5వేల మంది ఎంటెక్, పీహెచ్‌డీ పట్టభద్రులు స్పందించారని, వీరి నుంచి 1,225 మందిని ఎంపిక చేశామని చెప్పారు. వీరికి నెలకు రూ.70వేలు వేతనంగా చెల్లిస్తామన్నారు. అర్హులైన అధ్యాపకులు దొరక్కపోవటంతో వెనుకబడిన ప్రాంతాల్లోని ఈ కళాశాలల్లోని 60% బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Published date : 01 Feb 2018 02:04PM