Skip to main content

ఈ-సెట్ ఫలితాల విడుదల.. 89.24 శాతం ఉత్తీర్ణత

కాకినాడ, న్యూస్‌లైన్: ఈ-సెట్ -2014 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ వై.వేణుగోపాలరెడ్డి జేఎన్‌టీయూకేలో సోమవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో ఈనెల 10న 12 రీజనల్ సెంటర్లలో 99 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ-సెట్‌కు 48,705 మంది విద్యార్థులు హాజరుకాగా 43,466 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.24 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వేణుగోపాలరెడ్డి చెప్పారు. ఈ-సెట్ ను మూడుసార్లు విజయవంతంగా నిర్వహించి, అనుకున్న తేదీకల్లా ఫలితాలను విడుదల చేసిన జేఎన్‌టీయూకే అధికారులను అభినందించారు. ఈ ఏడాది నుంచి ఈ-సెట్ ఉత్తీర్ణులు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో సైతం రెండో సంవత్సరంలో చేరే అవకాశం కల్పించామని చెప్పారు. వీసీ డాక్టర్ జి.తులసీరామ్‌దాస్ మాట్లాడుతూ.. ఈ-సెట్ విద్యార్థు బార్‌కోడ్ షీట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో ఈ-సెట్ కన్వీనర్ డాక్టర్ సి.హెచ్.సాయిబాబు, వర్సిటీ రెక్టార్ డాక్టర్ బి.ప్రభాకరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు పాల్గొన్నారు.

ర్యాంకర్లువీరే: వివిధ బ్రాంచ్‌లలో మొదటి, రెండో ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. (సీటీ బ్రాంచ్‌లో హాజరైన ఒకే ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించగా, సీఆర్‌టీ బ్రాంచ్‌లో ముగ్గురు హాజరైతే ఇద్దరు ఉత్తీర్ణుల య్యారు) సివిల్ : వలుపదాసు నీలిమ (హన్మకొండ, వరంగల్ జిల్లా), గుండాల ధనుంజయ్ (నల్గొండ). ఈఈఈ : కాండ్రేగుల సాయి (విశాఖపట్నం), బుర్రా కరుణప్రియ (అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా). ఎంఈసీ : రామ్‌బా అశోక్ (విజయనగరం), చిన్నకొట్ల గణేష్ (అనంతపురం). ఈసీఈ : మంచే హరీష్ (నిజామాబాద్), నేమాని నవీన్ (వరంగల్). సీఎస్‌ఈ : వి.నరేంద్ర (హైదరాబాద్), చింతా వెంకటరమణ (అనంతపురం). సీహెచ్‌ఈ : పసుమర్తి సత్యసాయి (వద్దిపర్రు, తూర్పుగోదావరిజిల్లా), రామిరెడ్డి హరికృష్ణ (మక్కువ, విజయనగరం జిల్లా). ఈఐఈ : బి.సంతోషి (మహబూబ్‌నగర్), ఎల్.స్నేహలత (కరీంనగర్). ఎంఈటీ : కిల్లన హేమంతకుమార్ (విజయనగరం), వాకాడ నాగస్వామి కొండలరావు (యు.కొత్తపల్లి, తూర్పుగోదావరి జిల్లా). ఎంఐఎన్ : బొడ్డు తిరుపతి (మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా), కొండర కృష్ణకాంత్ (ఆదిలాబాద్). ఫార్మా : జువేరియా తస్లీమ్ (నల్గొండ), షేక్ దాదా ఖలందార్ (కడప). బీఎస్సీ : యాలంటి అయ్యప్ప (ఒంగోలు), మహంతి జయలక్ష్మి (నెల్లిమర్ల, విజయనగరం జిల్లా).

                                     For Results Click Here
Published date : 20 May 2014 11:31AM

Photo Stories