ఏప్రిల్ 14న కేఎల్ వర్శిటీ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష
Sakshi Education
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్‌ల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఏప్రిల్ 14న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వర్శిటీ ఉపాధ్యక్షుడు కోనేరు రాజాహరీన్ తెలిపారు.
ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విజయవాడలో మార్చి 21న జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందగోరే విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, నగదు బహుమతులు అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి మాట్లాడుతూ.. తమ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు విద్యావిధానాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశాల విభాగం డెరైక్టర్ జే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షను 60 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలను వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు.
Published date : 22 Mar 2019 03:23PM