ఏపీపీజీ ఈసెట్ ఫలితాలు మే 17న విడుదల
Sakshi Education
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీ ఈసెట్)మే 10నప్రారంభమైంది. తొలిరోజు పరీక్షకు సెట్-1 ప్రశ్నాపత్రాన్ని ఆంధ్రా యూనివర్సిటీలోని వైవీఎస్‌మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పరీక్షలు మే 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 నగరాల్లో 35 కేంద్రాల్లో జరుగుతాయన్నారు. ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఏయూ ఈ పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ఎంటెక్‌లో 22,021 సీట్లు, ఎం.ఫార్మసీలో 5,495 సీట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 29,339 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రంలోని అనంతపురం, భీమవరం, గుంటూరు, కడప, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, విశాఖ, విజయవాడ, విజయనగరం, తెలంగాణలోని హైదరాబాద్‌లో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. మే 17న ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
Published date : 11 May 2018 03:54PM