ఏపీలో 52,741 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏపీ ఈసెట్- 2017 ద్వారా భర్తీ చేయాల్సిన ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోయాయి.
జూలై 11న ఈసెట్ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ జీఎస్ పండాదాస్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. తొలివిడత, తుదివిడత కలిపి 19,375 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 72,116 సీట్లుండగా అందులో కేవలం నాలుగో వంతు మాత్రమే భర్తీ అయి 52,741 సీట్లు ఖాళీగా మిగిపిపోవడం గమనార్హం. కన్వీనర్ కోటాలో 72,116 సీట్లున్నా ఈ-సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు 30,877 మాత్రమే. ఇందులో మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు 20,039 మంది హాజరవగా, 18,146 మందికి సీట్లు కేటాయించారు. ఇందులో 16,539 మంది మాత్రమే కాలేజీల్లో రిపోర్టు చేశారు. తుదివిడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 7, 8వ తేదీల్లో నిర్వహించగా, 7,787 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కొత్తగా 2,836 మందికి సీట్లు కేటాయింపు చేయగా గతంలో కేటాయింపు అయి మార్పు కోరుకున్నవారు 3,728 మంది ఉన్నారు. సీట్ల కేటాయింపు అయిన అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోపు ఆన్‌లైన్లో, లేదా హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా సెల్ఫ్ రిపోర్టు చేయాలని, ఆ తేదీల్లోపే కాలేజీల్లో కూడా రిపోర్టు చేయాల్సి ఉంటుందని కన్వీనర్ పేర్కొన్నారు.
ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం: ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్- 2017 కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైందని సెట్స్ కౌన్సెలింగ్ ప్రత్యేకాధికారి విశ్వనాథరెడ్డి తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. 14 నుంచి 17వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని, 19వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. తొలిరోజు ధ్రువపత్రాల పరిశీలనకు 1 నుంచి 8 వేల ర్యాంకులోపు అభ్యర్థులను పిలవగా 4,403 మంది హాజరైనట్లు వివరించారు.

Published date : 12 Jul 2017 02:12PM