ఏపీ ఈసెట్-2019కి హాజరయ్యే విద్యార్థులకు సూచలు
Sakshi Education
జేఎన్‌టీయూ (అనంతపురం): ఆంధ్రప్రదేశ్ ఈసెట్-2019 ను ఏప్రిల్ 30న నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూ(ఏ) వీసీ, ఏపీ ఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాస్‌కుమార్ తెలిపారు.
ఏప్రిల్ 28న ఆయన జేఎన్‌టీయూ (ఏ)లో ఏపీ ఈసెట్ కన్వీనర్ పీఆర్.భానుమూర్తితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈసెట్ పరీక్షకు 39,734 మంది దరఖాస్తు చేశారని చెప్పారు. పలు కళాశాలల్లో ఈవీఎంలు భద్రపరచడంతో పరీక్ష కేంద్రాలు కొరత ఏర్పడిందని అందుకే 1,135 మంది అభ్యర్థులను హైదరాబాద్ పరీక్ష కేంద్రానికి కేటాయించినట్లు వివరించారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను తీసుకురావాలని, అప్లికేషన్ కాపీ మీద ఉన్న ఫొటోపైన గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలని తెలిపారు. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరైన నేపథ్యంలో చేతుల మీద టాటూ, మెహందీ వంటి డిజైన్లు ఉండరాదన్నారు. మే 1న ప్రిలిమనరీ కీ ని విడుదల చేస్తామన్నారు. మే 3 వరకు అభ్యంతరాలు స్వీకరించి 13న ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు.
Published date : 29 Apr 2019 04:25PM