Skip to main content

ఏపీ ఎంసెట్-2018 తొలివిడత సీట్ల కేటాయింపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్-2018 కౌన్సెలింగ్‌లో భాగంగా తొలివిడత సీట్ల కేటాయింపు జూన్ 5న జరిగింది.
ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 89,592 సీట్లు ఉండగా మొదటి విడత 60,943 మందికి సీట్లు కేటాయించారు. 28,649 సీట్లు మిగిలిపోయినట్లు ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ జీఎస్ పండాదాస్ తెలిపారు. ఫార్మసీ కాలేజీల్లో 2,962 సీట్లు ఉండగా అందులో కేవలం 266 మాత్రమే భర్తీ అయ్యాయి. 2,696 సీట్లు మిగిలిపోయాయి. యూనివర్సిటీ కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్ల కేటాయింపు సమాచారాన్ని విద్యార్థుల మొబైల్ నెంబర్లకు పంపారు. ఎంసెట్-2018లో మొత్తం 1,27,757 మంది ఉత్తీర్ణత సాధించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ ధ్రువపత్రాల పరిశీలనలో 67,078 మంది పాల్గొనగా వారిలో 65,909 మంది ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 4,966 మందికి సీట్లు కేటాయించలేదు. తమకు నచ్చిన కాలేజీలో మాత్రమే సీటు వస్తే చేరదామన్న ఉద్దేశంతో కొందరు పరిమిత సంఖ్యలో ఆప్షన్లు నమోదు చేయడం, మరికొందరు తమ ర్యాంకును బట్టి కాకుండా పరిమితికి మించి ఆప్షన్లు నమోదు చేయడం సీట్ల కేటాయింపు కాకపోవడానికి కారణంగా పేర్కొంటున్నారు.

కంప్యూటర్ సైన్స్కే ఎక్కువ డిమాండ్...
కాగా సీట్ల కేటాయింపులో కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎక్కువగా భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్ లో 87.07 శాతం, ఈసీఈలో 75.3 శాతం, మెకానికల్‌లో 56.18 శాతం, ఈఈఈలో 56.55 శాతం, సివిల్‌లో 55.83 శాతం, ఐటీలో 97.31 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీ సీట్లకు మాత్రం కేవలం 8.98 శాతం మాత్రమే విద్యార్థులు మాత్రమే ఆప్షన్లు ఇవ్వగా వారికి సీట్లు కేటాయించారు.

62 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ :
రాష్ట్రంలో యూనివర్సిటీల పరిధిలో 22, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు 263 ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజీల్లో మొత్తం 4,516 ఇంజనీరింగ్ సీట్లూ భర్తీ అయ్యాయి. ప్రైవేటు కాలేజీల్లోని 82,115 సీట్లలో 56,161 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 63 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1-5 సీట్లు మాత్రమే భర్తీ అయినవి 5 ఉన్నాయి. 1 నుంచి 50 లోపు సీట్లు భర్తీ అయిన కళాశాలలు 65 ఉన్నాయి.

ఫార్మసీని పట్టించుకోని విద్యార్థులు:
ఫార్మసీ వైపు విద్యార్థులు పెద్దగా మొగ్గుచూపకపోవడంతో సీట్లు భారీగా మిగిలిపోయాయి. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలు ఏడింటిలో ఉన్న 176 సీట్లలో 97 భర్తీ కాగా 79 మిగిలిపోయాయి. ఇక 102 ప్రైవేటు ఫార్మసీ కాలేజీల్లో 2,785 సీట్లుండగా కేవలం 169 మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 2,616 మిగిలిపోయాయి.

ఎంసెట్‌లో సీట్ల భర్తీ ఇలా..

ఎంసెట్‌లో అర్హత సాధించినవారు

1,27,757

సర్టిఫికెట్ ధృవీకరణ కోసం హాజరైన అభ్యర్థులు

67,078

ఆప్షన్లు నమోదు చేసినవారు:

65,909


కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల భర్తీ ఇలా..

యూనివర్సిటీ కాలేజీల్లో...

కోర్సు

లేజీలు

సీట్లు

భర్తీ

మిగులు

ఇంజనీరింగ్

22

4,516

4,516

0

ఫార్మసీ

7

176

97

79

మొత్తం

29

4,692

4,613

79

ప్రైవేట్ కాలేజీల్లో...

ఇంజనీరింగ్

263

82,115

56,161

25,954

ఫార్మసీ

102

2,785

169

2,616

మొత్తం

365

84,900

56,330

28,570

Published date : 06 Jun 2018 02:15PM

Photo Stories