Skip to main content

ఎంసెట్ ఫలితాలు ..ఇంజనీరింగ్‌లో తెలంగాణ.. మెడి సిన్‌లో ఆంధ్రా ఫస్ట్

హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వీటిని విడుదల చేసి ర్యాంకులు, మార్కులను వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకును ఇంజనీరింగ్‌లో తెలంగాణ విద్యార్థి నందిగం పవన్‌కుమార్ సాధించగా, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి గుర్రం సాయిశ్రీనివాస్ సాధించారు. ఇక మెడికల్‌లో టాప్- 10లో ఐదుగురు అమ్మాయిలు ఉండగా, ఇంజనీరింగ్‌లో టాప్-10లో ఒక్క అమ్మాయి కూడా లేదు. ఎంసెట్ ఫలితాల్లో పార్శదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈసారి విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను ఎంసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర కు అవసరమైన విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే 14వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్ ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కౌన్సెలింగ్ వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానుంది.

మొత్తం ఫలితాల్లో బాలికలే ఫస్ట్
  • లో ఎక్కువమంది బాలికలే అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌లో 1,66,743 మంది బాలురు పరీక్ష రాయగా, 1,12,577 మంది (67.51శాతం) ర్యాంకులు సాధించారు.
  • 1,00,77 మంది బాలికలు పరీక్ష రాయగా 76,257 మంది (76.19 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు.
  • అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌లో 39,107 మంది బాలురు పరీక్ష రాయగా 31,470 మంది (80.47 శాతం) అర్హత సాధించారు.
  • పరీక్ష రాసిన 67,289 మంది బాలికల్లో 57,017 మంది బాలికలు (84.73 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు.
రెండు రాష్ట్రాల్లో అర్హుల వివరాలివీ..
ఇంజనీరింగ్‌లో..
రాష్ట్రం పరీక్ష రాసింది అర్హులు శాతం
తెలంగాణ 1,16,858 80,479 68.86
ఆంధ్రప్రదేశ్ 1,45,412 1,05,556 72.59
ఇతరరాష్ట్రాలవారు 4,550 2,796 61.45

మెడికల్‌లో..
రాష్ట్రం పరీక్ష రాసింది అర్హులు శాతం
తెలంగాణ 51,278 41,529 80.98
ఆంధ్రప్రదేశ్ 52,859 45,571 86.21
ఇతరరాష్ట్రాలవారు 2,259 1,387 61.39
ఇంజనీరింగ్‌లో టాపర్స్

Education News


హా.టి.నెంబరు పేరు ర్యాంకు కంబైన్డ్ స్కోర్ ఎంసెట్ మార్కులు జిల్లా
1811117 ఎన్.పవన్ కుమార్ 1 99 158 హైదరాబాద్
1807539 జి.చాణక్యవర్ధన్‌రెడ్డి 2 98.59 157 హైదరాబాద్
1808053 ఎల్.నిఖిల్‌కుమార్ 3 98.43 157 రంగారెడ్డి
1811418 నారు దివాకర్‌రెడ్డి 4 98.30 157 కృష్ణా
4410070 వి. ఆదిత్యవర్ధన్ 5 97.66 155 విజయనగరం
1813404 పి.ప్రేమ్ అభినవ్ 6 97.53 155 హైదరాబాద్
4226285 బి. అక్షయ్‌కుమార్‌రెడ్డి 7 97.41 155 మహబూబ్‌నగర్
3516003 జి.సాయి కాశ్యప్ 8 97.24 155 నల్గొండ
4206022 పి.సాయిసూర్యప్రహర్ష 9 97.19 154 తూర్పుగోదావరి
1808480 చింతకింది సాయి చేతన్ 10 97.15 154 హైదరాబాద్

అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ టాపర్స్
Education News
హా.టి.నెంబరు
పేరు
ర్యాంకు
కంబైన్డ్ స్కోర్
ఎంసెట్ మార్కులు
జిల్లా
8211121
గుర్రం సాయి శ్రీనివాస్
1
99.45
159
ప్రకాశం
8215149
బి. దివ్య
2
99.45
159
నెల్లూరు
5903393
కందికొండ పృధ్వీరాజ్
3
99.24
159
హైదరాబాద్
5712246
దారపనేని హరిత
4
99.02
158
గుంటూరు
8216226
వి.మనోజ్ఞితారెడ్డి
5
99.02
158
కృష్ణా
8204130
ఎస్.భరత్‌కుమార్
6
99.02
158
ఖమ్మం
8403009
పట్టిసపు శ్రీవిద్య
7
98.98
158
విశాఖపట్నం
5901092
సాత్విక్ గంగిరెడ్డి
8
98.98
158
హైదరాబాద్
8219273
ఆర్. సాయి హర్షతేజ
9
98.90
158
ఖమ్మం
8202208
ఘంటా సాయి నిఖిల
10
98.85
158
గుంటూరు


For Results Click Here: Engineering | Medical

Published date : 10 Jun 2014 12:10PM

Photo Stories