ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భర్తీ కాని సీట్లు 37,248
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ - 2018 తుది కౌన్సెలింగ్ తర్వాత 37,248 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
మొత్తం 1,33,279 మంది ఎంసెట్‌లో అర్హత సాధించగా చివరి విడత కౌన్సెలింగ్ తర్వాత కేవలం 59,609 మంది మాత్రమే వివిధ కోర్సుల్లో చేరినట్లు సాంకేతిక విద్యా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంజనీరింగ్‌లో 36 శాతం సీట్లు మిగిలిపోయాయి. ఇంజనీరింగ్‌లో యూనివర్సిటీ, ప్రైవేటు కళాశాలలు కలిపి 287 కాలేజీల్లో 92,940 సీట్లు ఉండగా కేవలం 59,277 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో 33,663 సీట్లు మిగిలిపోయాయి. ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫార్మసీకి సంబంధించి మొత్తం 114 కాలేజీల్లో 3,322 సీట్లకు కేవలం 280 మాత్రమే భర్తీ కావడంతో 3,042 సీట్లు మిగిలిపోయాయి. ఫార్మాడీకి సంబంధించి 59 కాలేజీల్లో 595 సీట్లు ఉంటే అందులో కేవలం 52 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. జూలై 28 నుంచి 29 వరకు జరిగిన తుది అడ్మిషన్ ప్రక్రియలో అన్ని కోర్సులు కలిపి 3,641 మంది విద్యార్థులు చేరగా, 7,429 మంది విద్యార్థులు సీట్లు మార్చుకున్నారు.
సీఎస్‌ఈ, ఈసీఈ వైపే విద్యార్థుల మొగ్గు...
రాష్ట్రంలో మూడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. అలాగే కేవలం 30 మంది లోపు చేరిన కాలేజీల సంఖ్య 50 ఉంటే 26 కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. అత్యధికంగా 17,335 మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోగా, 17,228 మందితో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ తర్వాత స్థానంలో నిలిచింది.

Published date : 01 Aug 2018 04:17PM