ఏఐసీటీఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే...
Sakshi Education
సాక్షి, అమరావతి: సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు అందించే అన్ని విద్యాసంస్థలు ఇకపై జాతీయ సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే.
ఏఐసీటీఈ ఆమోదిస్తేనే ఆయా సంస్థలు కోర్సులు, ప్రవేశాలను నిర్వహించాల్సి ఉంటుంది. అడ్మిషన్ల విషయంలో ఇప్పటివరకు డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్న కొన్ని మినహాయింపులు ఇకపై వర్తించవు. దేశంలో ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు అందించే అన్ని విద్యా సంస్థలను ఏఐసీటీఈ పరిధిలో చేర్చాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ విద్యామండలి తాజాగా కొత్త నిబంధనావళిని అమల్లోకి తెచ్చింది. 2018-19 విద్యా సంవత్సరానికి ఆయా సంస్థలకు అనుమతి మంజూరుకు కొద్దిరోజుల క్రితం ‘పబ్లిక్ నోటీస్’ జారీ చేసింది. ఇప్పటివరకు డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇన్‌టేక్ సంఖ్యతో సంబంధం లేకుండా ఎన్ని సీట్లయినా భర్తీ చేసుకుంటున్నాయి. డిమాండ్‌ను బట్టి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సీట్ల భర్తీ విషయంలో ఇష్టారాజ్యానికి బ్రేకులు పడనున్నాయి. ఏఐసీటీఈ అనుమతుల మేరకే ఆయా సంస్థలు సీట్లను భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.
అనుమతులు పొందాల్సిందే..
సాంకేతిక, మేనేజ్‌మెంట్ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థలు, కొత్తగా ఏర్పాటు చేసే సంస్థలు ఏఐసీటీఈ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలి. కొత్త విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్-టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, అప్లయిడ్ ఆర్‌ట్స, క్రాఫ్ట్, హోటల్ మేనేజ్‌మెంట్, కేటరింగ్ టెక్నాలజీ/మేనేజ్‌మెంట్, ఎంసీఏ కోర్సుల్లో డిప్లొమా, పోస్టు డిప్లొమా, యూజీ, పీజీ, పీజీ డిప్లొమా అందించే ఆయా వర్సిటీలు, బోర్డుల అప్రూవల్ ఉన్న సంస్థలు కూడా తొలిసారిగా ఏఐసీటీఈ అనుమతులు తీసుకోవాల్సిందే. ఆర్కిటెక్చర్ కౌన్సిల్ అనుమతులతో కొనసాగుతున్న సంస్థలు, ఎంసీఏ, ఎంబీఏ తదిరత సాంకేతికేతర కోర్సుల సంస్థలు కూడా ఏఐసీటీఈ నుంచి అనుమతులు పొందాలి. సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన తీర్పు మేరకు డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీలు కూడా ఏఐసీటీఈకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వర్సిటీల విభాగాలు, ప్రైవేట్ వర్సిటీలు కూడా కొత్త సాంకేతిక విద్యాసంస్థల మాదిరిగా ఏఐసీటీఈకి దరఖాస్తు చేయాలి. విద్యాసంస్థలు మరో చోటుకు మారినా, మూసివేయాలని నిర్ణయించినా, మహిళా విద్యాసంస్థలను కో-ఎడ్యుకేషన్ సంస్థలుగా మార్చాలన్నా, మహిళా విద్యాలయాలుగా మార్చాలన్నా, ఇన్‌టేక్ పెంపు తదితర అంశాలకు ఏఐసీటీఈ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలి. అనుమతుల మంజూరు ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీతో ముగియనుంది.

Published date : 12 Feb 2018 05:18PM