ఏఐసీటీఈ ఆద్వర్యంలో ఉచితంగా 1500 ఐటీ కోర్సులు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండింగ్ కోర్సులుగా భావిస్తున్న.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), డేటాసెన్సైస్, క్లౌడ్ వంటి న్యూజనరేషన్ టెక్నాలజీ విభాగాల్లో శిక్షణను అందించనుంది.
నైపుణ్యత కోసం
ఎప్పటికప్పడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతోపాటు కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లో ఉండి ఐటీ కోర్సుల్లో శిక్షణ పొందాలనుకునే విద్యార్థులకు ఏఐసీటీఈ చేయూత అందిస్తోంది. అందులో భాగంగానే విద్యార్థుల నైపుణ్యావృద్ధికి కృషి చేయడానికి మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకుంది.
శిక్షణ ఎలా
ఈ ఒప్పందం ద్వారా దాదాపు 1500 కోర్సు మాడ్యూల్స్‌ను ఏఐసీటీఈ ఈ-లెర్నింగ్ పోర్టల్(ఈఎల్‌ఐఎస్) ద్వారా మైక్రోసాఫ్ట్ పూర్తి ఉచితంగా అందిస్తుంది. దీనికోసం మైక్రోసాఫ్ట్‌కు చెందిన మైక్రోసాఫ్ట్ లెర్నింగ్ రిసోర్స్ సెంటర్, ఏఐసీటీఈకి చెందిన ఈఎల్‌ఐఎస్ ప్లాట్‌ఫామ్‌తో కనెక్ట్ చేసి.. విద్యార్థులు వారంతట వారే నేర్చుకునే విధంగా రూపకల్పన చేశారు.
ఎవరు అర్హులు: 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఈ కోర్సులను సంబంధిత లెర్నింగ్ పోర్టల్ ద్వారా పూర్తి ఉచితంగా శిక్షణ పొందవచ్చు.
ప్రయోజనాలు:
- ఏఐసీటీఈ పరిధిలో చదివే విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ సంస్థ వెబినార్స్ ద్వారా వచ్చే జనరేషన్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది.
- దీనిద్వారా మొబైల్ యాప్స్ తయారు చేయడం.. ఏఐ ఆధారిత సేవలు, ఉత్పత్తులు ఆవిష్కరించడం.. క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లలో బిగ్ డేటా అనాలసిస్ సహా ఇతర విభాగాల్లో నైపుణ్యం పొందవచ్చు.
- ఉపాధ్యాయులకు సాంకేతిక బోధన నైపుణ్యాలను పెంపొందించడానికి మైక్రోసాఫ్ట్ లెర్న్ ఫర్ ఎడ్యుకేటర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్ లెర్నింగ్ మెథడ్స్, అవసరమైన మెటీరియల్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచనుంది. తద్వారా ఉపాధ్యాయులు ఆయా కోర్సులను అధ్యయనం చేసేందుకు వీలుంటుంది.