Skip to main content

డిసెంబర్ 28, 29 తేదీల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంటర్వ్యూలు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా విద్యార్థులకు ప్రముఖ పరిశ్రమలు, సంస్థల్లో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ కోసం ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డెరైక్టర్ యూవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ బోర్డు ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ (బీవోఏటీ) సంయుక్తాధ్వర్యంలో డిసెంబర్ 28, 29 తేదీల్లో హిమాయత్‌సాగర్‌లోని లార్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 28న ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈసీఈ, ఐఈ, సీఎస్‌ఈ, ఐటీ వారికి, 29న ఈఈఈ, మెకానికల్, సివిల్, మెటలర్జికల్, ఆటోమొబైల్, కెమికల్, మైనింగ్ ఇంజనీరింగ్, బీఫార్మసీ అలాగే డిప్లొమా, డి-ఫార్మసీ వారికి ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, మూడు సెట్ల బయోడేటా ఫారంలతో రావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం www.boatsr.com www.apprentice.tn.nic.in వెబ్‌సైట్‌ను, లేదా 044-22542703, 044-22542235 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని వివరించారు.
Published date : 23 Dec 2017 02:24PM

Photo Stories