డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ తరగతులు: ఏఐసీటీఈ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, డిప్లొమా తదితర కాలేజీల్లో మొదటి ఏడాది తరగతులను డిసెంబర్ 1 నుంచి ప్రారంభించేలా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుక్రవారం ప్రత్యామ్నాయ క్యాలెండర్‌ను ప్రకటించింది.
ఇప్పటికే ఐఐటీలు, ఎన్‌ఐటీలకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో పాటు పలు రాష్ట్రాల నుంచి విన్నపాలు వస్తున్న నేపథ్యంలో తరగతుల ప్రారంభంపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు మండలి సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. నవంబర్ 30 నాటికి ఫస్టియర్ అడ్మిషన్లను పూర్తి చేసి డిసెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని వివరించారు. ఇంతకు ముందు నవంబర్ 1 నాటికి చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసి అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా ఏఐసీటీఈ ప్రకటించింది. తాజాగా దాన్ని నవంబర్ 30 నాటికి అడ్మిషన్లను పూర్తి చేసి డిసెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని పేర్కొంది.
Published date : 17 Oct 2020 02:57PM