Skip to main content

డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు తప్పనిసరి అప్రెంటీస్‌షిప్

జేఎన్‌టీయూ (అనంతపురం): వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు తప్పనిసరిగా ఏడాది పాటు అప్రెంటీస్‌షిప్ శిక్షణను అమల్లోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు.
 అవసరమైతే డిగ్రీ కోర్సు గడువు మరో ఏడాది పొడిగించే యోచనలో ఉన్నామన్నారు. జేఎన్‌టీయూ అనంతపురంలో నవంబర్ 23నపర్యటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.  వైస్ చాన్సలర్లు, పాలకమండలి సభ్యులను మరో 20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుందని తెలిపారు. ఉన్నత విద్యకు రానున్న నాలుగు సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో రూ. 1.72 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయన్నారు. మరింత చురుగ్గా ఉండి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యకు రూ. 7,500 కోట్ల నిధులు తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవను ప్రదర్శిస్తోందని వివరించారు. వర్సిటీల్లో ప్రమాణాలు పెంచేందుకు 1,600 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను మూడు విడతల్లో భర్తీ చేసే ప్రణాళికకు రూపకల్పన జరిగిందని చెప్పారు.
Published date : 25 Nov 2019 02:48PM

Photo Stories