డాటా సైన్స్‌లో పార్ట్‌టైం ఎం.టెక్ కోర్సు
Sakshi Education
వచ్చే విద్యా సంవత్సరం హైదరాబాద్ ఐఐటీలో ప్రారంభం
హైదరాబాద్: మెదక్ జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2015-16) డాటాసైన్స్‌లో ఎగ్జిక్యూటివ్ ఎం.టెక్ పార్ట్‌టైం కోర్సును ప్రవేశ పెట్టనున్నట్లు ఐఐటీ వర్గాలు తెలిపాయి.
పోస్టు గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. ఈ కోర్సును 2 నుంచి 4 ఏళ్లలోపు పూర్తి చేయవచ్చని, హెల్త్‌కేర్, ఇన్స్యూరెన్స్, ఈ-కామర్స్, ట్రాన్స్‌పోర్టు, బ్యాంకింగ్, టెలీకమ్యూనికేషన్స్ రంగాల అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించినట్లు తెలిపాయి. పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని, జూన్ 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని వెల్లడించాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 10న ప్రకటిస్తామని, ఆగస్టు1 నుంచి తరగతులను నిర్వహిస్తామని ఐఐటీ వర్గాలు తెలిపాయి.

Published date : 12 May 2015 12:46PM