Skip to main content

బీటెక్ ప్రవేశాలకు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ఇడుపులపాయ, నూజివీడులలో ఆరేళ్ల సమీకృత బీటెక్ డిగ్రీ మొదటి సంవత్సరం (2016-17)లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆర్‌జీయూకేటీ ఉపకులపతి కోరారు.
ఈనెల 16 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని.. వచ్చేనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు అభ్యర్థులు 2016 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు మించకుండా, ఎస్సెస్సీ కానీ తత్సమాన పరీక్షలో ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థులుగా ప్రథమ ప్రయత్నంలో ఉత్తీర్ణులైన ఉండాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కేవలం ఏపీ ఆన్‌లైన్ సర్వీసు ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రపతి, ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మొత్తం సీట్లలో 85 శాతం లోకల్ విద్యార్థులకు (ఏపీ), 15 శాతం ఓపెన్ సీట్లు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు కేటాయించినట్లు చెప్పారు. దరఖాస్తుకు ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు. 2016-17 విద్యాసంవత్సరంలో మరో రెండు ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ కళాశాలల విషయంలో ప్రభుత్వం తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.
Published date : 12 May 2016 05:40PM

Photo Stories