Skip to main content

బీటెక్ బయోటెక్నాలజీలో ప్రవేశానికి ప్రత్యేక పరీక్ష!

హైదరాబాద్: బీటెక్ బయో టెక్నాలజీ కోర్సు.. బైపీసీ విద్యార్థులకు ఎక్కువగా సంబంధం ఉండే సబ్జెక్ట్. కానీ ఇందులో చేరాలంటే ఎంసెట్ ఒక్కటే రాస్తే సరిపోదు...
తప్పనిసరిగా ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్ చదివి ఉండాలి. అలాకాకపోతే కనీసం మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు అయినా చేసి ఉండాలి. అయితే, ఈ నిబంధనను మార్చాలని జేఎన్‌టీయూహెచ్ యోచిస్తోంది.

బైపీసీ చదివి మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు చేయకుండా ఎంసెట్‌లో ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ఎంసెట్ రాసి అర్హత సాధించిన విద్యార్థులు ఈ ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణులైతే బీటెక్ బయోటెక్నాలజీలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఈసారి ప్రవేశాల్లో ఇందుకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంపై వచ్చిన విజ్ఞప్తుల మేరకు జేఎన్‌టీయూహెచ్ అధికారులు చర్యలకు పూనుకున్నారు.
Published date : 06 Mar 2015 12:23PM

Photo Stories