ఆరు లక్షల ఇంజినీరింగ్ సీట్ల కుదింపు
Sakshi Education
ముంబై: దేశవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల ఇంజనీరింగ్ సీట్లకు కోత పెట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) భావిస్తోంది. ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పడిపోతున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాబోయే నాలుగైదేళ్లలో కొన్ని కాలేజీలను మూసివేయడం, మరికొన్నింటిలో సీట్ల సంఖ్యను తగ్గించడం... ద్వారా ఆరు లక్షల సీట్లను తగ్గిస్తామని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రాబుధే మింట్ పత్రికతో చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16.7 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, వీటిని 10 నుంచి 11 లక్షలకు తేవాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాలేజీ మూసివేత, ఇంజనీరింగ్ విభాగాల మూసివేతకు సంబంధించి ఇప్పటికే తమకు 1,422 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. డిమాండ్‌కు మించి ఇంజనీర్లు తయారవుతున్నారని, డిమాండ్- సరఫరా మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
Published date : 23 Sep 2015 01:33PM