అనుబంధ గుర్తింపులో జేఎన్‌టీయూహెచ్ పక్షపాత వైఖరి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయంలో జేఎన్‌టీయూహెచ్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయంలో జేఎన్‌టీయూ అధికారులు పక్షపాత ధోరణి అవలంబించారని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.
బహిరంగంగా మాట్లాడితే జేఎన్‌టీయూ అధికారులు వేధిస్తారనే భయంతో కోర్టును ఆశ్రయిం చాల్సి వచ్చిందని ఓ యాజమాన్య ప్రతినిధి పేర్కొన్నారు. జేఎన్‌టీయూ అధికారులు అనుబంధం గుర్తించే విషయంలో భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వంలోని కీలక నాయకుడి హస్తముందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఒక ప్రాంతానికి చెందిన కీలక నాయకుడి ప్రమేయంతో తెలంగాణ ప్రభుత్వంలోని కీలక నాయకుడితో చేసుకున్న ఒప్పందం మేరకే తమకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని ఆరోపణలు సంధించారు.
రాత్రికి రాత్రే తొలగింపు!
గతనెల 28వ తేదీ వరకు కోర్టు ఆదేశాల ప్రకారం అభ్యంతరాలను స్వీకరించిన జేఎన్‌టీయూ.. అదే రోజు అర్ధరాత్రి అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచిందని, తెల్లవారే సరికి వాటిని తొలగించిందని పేర్కొన్నారు. అది టెస్టు మెయిల్ మాత్రమేనని జేఎన్‌టీయూ అధికారులు వెల్లడించారు. ఏయే కాలేజీలలో ఎన్ని బ్రాంచ్‌లకు అనే విషయాలను వెల్లడించలేదని తెలంగాణ యాజ మాన్యాలు పేర్కొంటున్నాయి. టెస్టు మెయిల్ పేరుతో 28 అర్ధరాత్రి కాలేజీల యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌తో డౌన్‌లోడ్ చేసుకునేలా వెబ్‌సైట్లో పెట్టి ఆ తర్వాత ఎందుకు తొలగించారని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. కావాలనే ముడుపులు ముట్టజెప్పిన వారికే అనుబంధ గుర్తింపు ఇచ్చి మిగతా వారికి ఇవ్వలేదని పేర్కొంటున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్ అడిగిన వివరాలపై జేఎన్‌టీయూ తప్పుడుసమాచారం ఇచ్చిందని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

Published date : 04 Jul 2015 03:39PM