Skip to main content

ఆన్‌లైన్‌లోనే మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ

హైదరాబాద్: ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు ఫారాలు మాత్రమే ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచడం కాకుండా సీట్ల కేటాయింపు కూడా ఆన్‌లైన్‌లోనే చేయాలని భావిస్తోంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఇష్టానుసారంగా అమ్ముకునే చర్యలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్‌ఆర్‌ఐ కోటా భర్తీ విషయంలో స్పాన్సర్డ్‌కు అవకాశం కల్పించకూడదని నిర్ణయించింది.ఈసీట్లను పక్కాగా ప్రవాస భారతీయుల పిల్లలకే కేటాయించాలని నిర్ణయానికి వచ్చింది. అన్నీ వీలైతే ఆగస్టు 18న లేదంటే ఆ తర్వాత కన్వీనర్ కోటాలోనూ సీట్ల భర్తీకి అవసరమైన కసరత్తు మొదలు పెట్టాలని సర్కారు యోచిస్తోంది. ఆగస్టు 4న సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Published date : 25 Jul 2014 12:32PM

Photo Stories