ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు వాయిదా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సీట్ల కేటాయింపు వాయిదా పడింది.
ఫీజులు ఖరారు కాకుండా సీట్ల కేటాయింపునకు అవకాశం లేకపోవడంతో 22న చేయాల్సిన సీట్ల కేటాయింపును అడ్మిషన్ల కమిటీ వాయిదా వేసింది. దీనిపై అధికారిక ప్రకటన చేయాలని భావించినా మంత్రి కార్యాలయం నుంచి అనుమతి రాలేదు. మరోపక్క ఆప్షన్ల మార్పులో సరైన సమాచారం లేనందున వేలాది మంది అభ్యర్థులు 19, 20 తేదీల్లో అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. సీట్ల కేటాయింపు వాయిదా పడినందున అభ్యర్థులందరూ 21వ తేదీ (మంగళవారం) సాయంత్రం వరకు తమ ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చని అడ్మిషన్ల కమిటీ సమాచారాన్ని పంపింది. ఈనెల 23, లేదా 24వ తేదీల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని అడ్మిషన్ల కమిటీ వర్గాలు తెలిపాయి.
Published date : 21 Jun 2016 04:04PM