Skip to main content

అక్టోబర్10 నుంచి టీఎస్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈనెల 10 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను 6న విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రవేశాల కమిటీ దృష్టి సారించింది. ప్రభుత్వం కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి ఇస్తుందని, ఆ వెంటనే జేఎన్‌టీయూ అనుబంధ గుర్తింపు జారీ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అనుబంధ గుర్తింపు జారీలో జాప్యం జరిగితే మాత్రం ప్రవేశాల కౌన్సెలింగ్‌లోనూ ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది.

Must Check: TS EAMCET Mock Counselling/ College Predictor
Published date : 01 Oct 2020 12:56PM

Photo Stories