ఐఐటీ సీట్లన్నీ ఫుల్...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో బీటెక్ సీట్లన్నీ భర్తీ అయ్యారుు. గతంలో ప్రతిసారి సీట్లు మిగిలే ఐఐటీల్లో ఈసారి అన్ని సీట్లు భర్తీ అయ్యాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) కార్యదర్శి సుబ్రహ్మణ్యం ట్వీట్ చేశారు.
ఐఐటీల్లో మొత్తం 13,604 బీటెక్ సీట్లు అందుబాటులో ఉండగా, ఇటీవల పూర్తి చేసిన జోసా కౌన్సెలింగ్‌తో అన్ని సీట్లు భర్తీ అయ్యాయ ని వెల్లడించారు. అన్ని ఐఐటీల సమన్వయం, ఐఐటీ రూర్కీ సహకారంతో ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు సూపర్ న్యూమరీ సీట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్) కోసం అదనపు సీట్లు పెంచినా అన్ని సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు.
Published date : 03 Aug 2019 02:29PM