ఐఐటీ హైదరాబాద్‌లో నవంబర్ 20 వరకు ప్లేస్‌మెంట్స్
Sakshi Education
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని కంది సమీపంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో 2019-20 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన మొదటి దశ ప్లేస్‌మెంట్స్ ఈనెల 20 వరకు కొనసాగుతాయని ఐఐటీ ప్లేస్‌మెంట్స్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్‌కుమార్ యెములా తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఐఐటీ హైదరాబాద్ ఒక ప్రకటన విడుదల చేసింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం ఇప్పటివరకు 476 మంది విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. మైక్రోసాఫ్ట్, డీఇషా, గోల్డన్‌సాచ్, ఆర్రెసియం, అరిస్టా, అమెజాన్ వంటి సంస్థల నుంచి విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ ఆఫర్లు అందుకున్నారని పేర్కొన్నారు. రెండో దశ వచ్చే సంవత్సరం జనవరిలో ఉంటుందని ఆయన వివరించారు.
Published date : 07 Nov 2019 03:53PM