Skip to main content

ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల

సాక్షి, హైదరాబాద్: మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇటీవల నిలిపివేసిన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలను మళ్లీ జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రారంభించింది. ఈ మేరకు జూలై 10న మూడో దశ సీట్ల కేటాయింపుతోపాటు రివైజ్డ్ షెడ్యూల్‌ను జారీ చేసింది.
ఇదీ తేదీల వారీగా సవరించిన షెడ్యూల్...
జూలై 11న:
ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ/ రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల విత్ డ్రా(మూడో దశ).
జూలై 12న: సాయంత్రం 4 గంటలకు 4వ దశ సీట్ల కేటాయింపు, భర్తీ అయిన సీట్ల ప్రకటన.
జూలై 13న: ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ/ రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల విత్ డ్రా(నాలుగో దశ).
జూలై 14న: సాయంత్రం 4 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు. భర్తీ అయిన సీట్ల ప్రకటన.
జూలై 15న: ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ/రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల విత్ డ్రా(ఐదో దశ).
జూలై 15న: రాత్రి 10 గంటలకు ఆరో దశ సీట్ల కేటాయింపు, భర్తీ అయిన సీట్ల ప్రకటన.
జూలై 16న: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, జూలై 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ/రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల విత్ డ్రా(ఆరో దశ). సీట్ల విత్ డ్రాకు ఇదే చివరి అవకాశం.
జూలై 18న: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, ఖాళీల వివరాల ప్రకటన.
జూలై 18న: మధ్యాహ్నం ఒంటి గంటకు 7వ దశ సీట్ల కేటాయింపు.
జూలై 19న: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేవలం ఐఐటీల్లో ప్రవేశాలకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిపోర్టింగ్ కేంద్రాల్లో సీటు యాక్సెప్టెన్సీ(ఐఐటీలో సీట్లు వచ్చిన వారికి, ఎన్‌ఐటీల నుంచి ఐఐటీలకు వచ్చిన వారికి).
జూలై 19 నుంచి 23 వరకు: ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిపోర్టింగ్ కేంద్రాల్లో రిపోర్టు చేయడం, కాలేజీల్లో చేరడం.
Published date : 11 Jul 2018 02:44PM

Photo Stories