ఐఐటీ - బాంబే, వాషింగ్టన్ యూనివర్సిటీల.. ఈ-ఎంబీఏ ప్రోగ్రామ్
Sakshi Education
ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. ఐఐటీ-బాంబే, యూఎస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ-సెయింట్ లూయిస్ కలిసి ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఈ-ఎంబీఏ) కోర్సును అందించనున్నాయి. 2015 ప్రారంభంలో ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఈ కోర్సు వ్యవధి 18 నెలలు. కోర్సు ఫీజు 55000 యూఎస్ డాలర్ల నుంచి 60000 యూఎస్ డాలర్ల వరకు ఉంటుంది. క్లాసులు ఐఐటీ - బాంబేలో ఉంటాయి. రెండు దేశాలకు చెందిన ఫ్యాకల్టీ పాఠాలు బోధిస్తారు. కోర్సు పూర్తయ్యాక జాయింట్ డిగ్రీ అందిస్తారు.
Published date : 19 Jul 2014 12:02PM