ఆగస్టు 26 నుంచి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు తుది కౌన్సెలింగ్
Sakshi Education
నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన ఈడబ్ల్యుఎస్ కోటా రిజర్వేషన్ కింద నాలుగు ట్రిపుల్ ఐటీలకు 400 సీట్లు అదనంగా రావడంతో ఈ సీట్ల భర్తీకి ఆగస్టు 27న కౌన్సెలింగ్ జరగనుంది. తొలివిడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన 199 సీట్లు, పెరిగిన 400.. మొత్తం 599 సీట్లున్నాయి. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. ఈ ప్రక్రియను అడ్మిషన్ల కన్వీనర్ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు పర్యవేక్షిస్తున్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీలకు సంబంధించి కౌన్సెలింగ్‌ను నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే నిర్వహించనున్నారు.
Published date : 26 Aug 2019 04:12PM