Skip to main content

ఆగస్టు 26, 27 తేదీల్లో టిపుల్ ఐటీ నూజివీడులో కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి/వేంపల్లె/నూజివీడు: ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలలో మొదటి విడతలో మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 18న రెండో జాబితా విడుదల చేశారు.
నాలుగు ట్రిపుల్ ఐటీలలో మిగిలిపోయిన 199 సీట్లకు ఎంపికై న విద్యార్థులకు, స్పెషల్ కేటగిరి (ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్‌సీ, స్పోర్‌‌ట్స) విద్యార్థులకు కలిపి ఆగస్టు 26వ తేదీన, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటాకు సంబంధించి 400 సీట్లకు 27వ తేదీన నూజివీడు క్యాంపస్‌లో కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. రెండో జాబితాకు ఎంపికై న విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.rgukt.in వెబ్‌సైట్ నుంచి ఆగస్టు 18నే డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా విద్యార్థులు తమ ధ్రువపత్రాలను వెంటనే "admissions@rgukt.in’కు మెయిల్ చేయాలని సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 4వ తేదీ నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.
Published date : 19 Aug 2019 05:20PM

Photo Stories