ఆగస్టు 24 నుంచి బీటెక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీటెక్ మొదటి సంవత్సరం (రెండో సెమిస్టర్), బీటెక్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు24వ తేదీ నుంచి జరుగుతాయని జేఎన్‌టీయూహెచ్ పరీక్షల విభాగం ప్రకటించింది.
ఈ పరీక్షలకు హాజరుకాగల విద్యార్థులు ఆగస్టు10వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా పరీక్షల ఫీజు చెల్లించాలని కోరింది. రూ.100 ఆలస్య రుసుముతో ఆగస్టు16వ తేదీ వరకు, రూ.1,000తో 18 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో 19 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.
Published date : 03 Aug 2017 03:03PM