9, 10 తేదీల్లో ఈసెట్ వెబ్ ఆప్షన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో (ల్యాటరల్ ఎంట్రీ) చేరేందుకు నిర్వహించిన ఈసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు.
ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోని విద్యార్థులు ఈనెల 9న వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపారు. 12వ తేదీన సాయంత్రం 6 గంటలకు సీట్లు కేటాయిస్తామని వివరించారు.
Published date : 06 Jul 2016 02:51PM