20 న పాలిసెట్, ఈసెట్ సీట్లు కేటాయింపు.. వచ్చేనెల 15 లోగా ప్రవేశాలన్నీ పూర్తి
Sakshi Education
హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్‌లో ర్యాంకర్లకు ఈ నెల 20వ తేదీన సీట్లను కేటాయిస్తున్నట్టు ప్రవేశాల ముఖ్యఅధికారి రఘునాథ్ ఆదివారం తెలిపారు. వాటితోపాటు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే (లాటరల్ ఎంట్రీ) ఈసెట్ సీట్ల కేటాయింపును కూడా ఈనెల 20న ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అన్ని వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలను వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ మొదటి దశ ప్రవేశాలను ఈనెలాఖరులోగా పూర్తి చేస్తామని, రెండోదశ ప్రవేశాలను వచ్చేనెల 10వ తేదీలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఐసెట్ ప్రవేశాలను కూడా చేపడతామన్నారు. అందులోనూ రెండో దశ ప్రవేశాలు వచ్చేనెల 15వ తేదీలోగా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.
Published date : 18 Aug 2014 12:33PM