20 ఇంజనీరింగ్ కళాశాలలోఆకస్మిక తనిఖీలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు మెరుగు పర్చేందుకు ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో 20 ఇంజనీరింగ్ కళాశాలల్లో నవంబర్ 27నఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఉభయ గోదావరి, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో బృందాలు తనిఖీ చేశాయి. ఆయా కాలేజీల్లో కనీస వసతులు సైతం లేవని, అంతా ఉత్త డొల్లేనని తేటతెల్లమైంది. ఏఐసీటీఈ, ఉన్నత విద్యాశాఖ, వర్సిటీల నిబంధనలకు అనుగుణంగా ఏ కాలేజీ కూడా వ్యవహరించడం లేదు. 50 నుంచి 90 శాతం నిబంధనల ఉల్లంఘనలు జరుతుగున్నట్లు తేలింది. కాలేజీలో 1:20 నిష్పత్తిలో బోధనా సిబ్బంది ఉండాలి. కొన్ని కాలేజీల్లో 1:100 నిష్పత్తిలో బోధనా సిబ్బంది ఉన్నారు. అర్హత లేనివారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించారు. కొన్ని కాలేజీల్లో తనిఖీలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. అనంతరం తనిఖీ బృందాలు తమ నివేదికను కమిషన్‌కు అందజేయనున్నాయి. ప్రమాణాలు పాటించని కాలేజీల గుర్తింపును రద్దు చేయడం వంటి చర్యలను ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేయనుంది. కాలేజీల్లో తనిఖీల ప్రక్రియ ఇకపై నిరంతరం కొనసాగుతుందని కమిషన్ వర్గాలు వివరించాయి.
Published date : 28 Nov 2019 02:22PM