15 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ హాల్‌టికెట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి ఈనెల 24న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ ముంబై తెలిపింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సోమవారం (11వ తేదీ) నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాల్సి ఉండగా, దానిని 15వ తేదీకి వాయిదా వేసినట్లు తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. విద్యార్థులు 20వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, వాటిల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మార్పు చేసుకోవచ్చని వెల్లడించింది.
Published date : 12 May 2015 12:47PM