Skip to main content

TS EAPCET Counselling 2025 Dates : ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌పై క్లారిటీ..! ఆగస్టు 14లోపు...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు మే 11వ తేదీన విడుద‌లైన విష‌యం తెల్సిందే. అయితే కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుందనే అంశంపై విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.
TS EAPCET Counselling 2025 Dates

అయితే ఎట్ట‌కేల‌కు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మ‌న్‌ వి.బాలకిష్టారెడ్డి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్ పై క్లారీటీ ఇచ్చాడు. జూలై మొద‌టి వారంలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్ ప్రారంభించి.. ఆగస్టు 14వతేదీ లోపు ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి చేస్తామ‌న్నారు.

☛➤ AP EAPCET College Predictor

ఇంజ‌నీరింగ్‌ బీ కేటగిరీ సీట్ల అంశంపై...
ఇంజ‌నీరింగ్ బీ కేటగిరి సీట్ల కేటాయింపుపై ప్రభుత్వానికి లేఖ రాశాం. ఇంకా బీ కేటగిరీ సీట్ల అంశంపై ఎలాంటి స్పష్టత రాలేద‌ని ఉన్నత విద్యామండలి చైర్మ‌న్‌ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. అలాగే ఇంజ‌నీరింగ్ సిలబస్‌ మార్పుపై కసరత్తు చేస్తున్నామ‌న్నారు. ఇంకా కోర్సుల ఎంపికపై విద్యార్థులకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసామ‌న్నారు.

☛➤ TG EAPCET College Predictor 2025

కొన్ని విద్యాసంస్థలు త‌ప్పుగా..
డీమ్డ్‌ వర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్టు కొన్ని విద్యాసంస్థలు త‌ప్పుగా చెబుతున్నాయి. అలాగే ఇంజినీరింగ్‌ విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలు చేస్తున్నాయి.

Published date : 11 Jun 2025 08:38AM

Photo Stories