Skip to main content

TS EAPCET 2025 ఇంజినీరింగ్‌ ప్రాథమిక కీ విడుదల.. కీపై అభ్యంతరాలు ఇలా నమోదు చేసుకోండి!

సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ EAPCET 2025 (TS EAPCET) ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రాథమిక కీ (Preliminary Key) ను మే 5న సాయంత్రం 5 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్‌ షీట్, ప్రశ్నపత్రం (Master Question Paper) ను కూడా వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
TS EAPCET 2025 Engineering Preliminary Key Released   TS EAPCET 2025 Preliminary Key Released  Check TS EAPCET 2025 Engineering Answer Key Online  Telangana EAPCET 2025 Key Released on May 5 at 5 PM

ఈ కీపై అభ్యంతరాలు ఉన్నవారు మే 7, 2025 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. కన్వీనర్ ఆచార్య డీన్‌కుమార్, కో-కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి పేర్కొన్న వివరాల ప్రకారం, ఏవైనా తప్పులపై సమగ్రంగా అభ్యంతరాలు సమర్పించాల్సిందిగా సూచించారు.

TS EAPCET 2025 ఇంజినీరింగ్ విభాగపు ఆన్‌లైన్ పరీక్షలు మే 2 నుంచి మే 4 వరకు మూడు రోజుల పాటు జరిగాయి. ఈ విభాగానికి మొత్తం 2,20,327 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,07,190 మంది (94.04%) హాజరయ్యారు.

చదవండి: TG EAPCET 2025: పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలు.. ఫలితాలు ఇసారి ఇలా!

చివరిరోజు గణితం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. నిపుణుల అంచనాల ప్రకారం 80% విద్యార్థులు కనీసం సగం గణిత ప్రశ్నలకు ఊహ ఆధారంగా జవాబులు గుర్తు పెట్టి ఉండవచ్చని పేర్కొన్నారు.

ఇంతకుముందు, అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగానికి సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ మరియు ప్రశ్నపత్రం ఏప్రిల్ 30న ముగిసిన వెంటనే విడుదలైంది. ఈ విభాగానికి 86,762 మంది దరఖాస్తు చేసుకోగా, 81,198 మంది (93.59%) పరీక్షకు హాజరయ్యారు. ఈ విభాగంపై అభ్యంతరాల గడువు మే 6 మధ్యాహ్నం 12 గంటల వరకుగా ఉంది.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 May 2025 08:33AM
PDF

Photo Stories