TG EAPCET Results 2025: ఈఏపీసెట్ ఫలితాలు.. కౌన్సెలింగ్ వివరాలు ఇలా!

ఈఏపీసెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలను వేగంగా తెలుసుకునేందుకు 'సాక్షి ఎడ్యుకేషన్' కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
చదవండి: College Predictor - 2024 - AP EAPCET | TS EAMCET
కౌన్సెలింగ్ ఆలస్యం: కారణాలివే
ఏఐసీటీఈ (AICTE) అనుమతులు ఇంకా రావాలి
ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల పెంపు కోసం దరఖాస్తులు చేసుకున్నా, ఏఐసీటీఈ అనుమతి ఇంకా మంజూరు కాలేదు. అనుమతి లేకపోతే కౌన్సెలింగ్ ప్రారంభం కాలే అవకాశం ఉంది.
అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు
159 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇంకా మంజూరు కాలేదు. మౌలిక వసతులు, అధ్యాపకులు వంటి అంశాలపై విశ్వవిద్యాలయాల పరిశీలనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
నిర్దిష్ట ఫీజు వివరాలు లేవు
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి ఫీజులు టీఎఫ్‌ఆర్‌సీ (TFRC) ఇంకా ఖరారు చేయలేదు. కొన్ని ప్రైవేటు కాలేజీలు భారీగా ఫీజు పెంపు ప్రతిపాదనలు పంపాయి.
జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ కాలేదు
జాతీయ స్థాయి IIT, NITల ప్రవేశాల కోసం జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. దీంతో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
![]() ![]() |
![]() ![]() |
Tags
- TG EAPCET 2025 results
- Telangana EAPCET Result Date
- TG EAPCET 2025 Counselling Delay
- Engineering Admission Telangana 2025
- TS EAPCET Counselling Schedule 2025
- AICTE Approval Engineering Colleges 2025
- Pharmacy Admission Telangana 2025
- EAPCET Seat Allotment Telangana
- Telangana Engineering College Fees 2025
- Affiliation Process Telangana Colleges
- JoSAA Counselling Schedule 2025
- TS EAPCET Engineering Seat Matrix
- EngineeringAdmissions
- PharmacyAdmissions
- AgricultureAdmissions